![Four Arrested For Molesting Doctor At Mid Night Vellore - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/22/666.jpg.webp?itok=wOo828hv)
ప్రతీకాత్మక చిత్రం
వేలూరు(చెన్నై): వేలూరు సత్‌వచ్చారిలో ఓ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం ఘటన సంచలనం రేపింది. వివరాలు.. వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ యువతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈమె మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి కాట్పాడిలోని సినిమా థియేటర్‌లో సెకెండ్‌షోకు వెళ్లారు. అనంతరం స్నేహితులతో కలిసి వేలూరుకు షేర్ ఆటోలో బయలు దేరింది. (చదవండి: Mysterious Death: ప్రేమ పెళ్లి.. పుట్టింటి నుంచి భర్తతో కలిసి వెళ్లి.. )
ఆ ఆటోలో అప్పటికే నలుగురు వ్యక్తులున్నారు. వారంతా కలసి ఆటోను సత్‌వచ్చారిలోని మరో రోడ్డుకు మళ్లించారు. యువతి డ్రైవర్‌ను నిలదీయగా సమాధానం ఇవ్వకుండా ఆటోను పాలారు నది ఒడ్డుకు తీసుకెళ్లారు. యువతి స్నేహితునిపై దాడి చేసి అక్కడ నుంచి బెదిరించి తరిమి వేశారు. అనంతరం నలుగురు వ్యక్తులు కలిసి ఆ యువతిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలు సత్‌వచ్చారి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment