
కీర్తిక హత్య కేసులో టెన్త్ విద్యార్థి అరెస్ట్
వేలూరు: తమిళనాడులోని వేలూరు జిల్లాలోని కేవీ కుప్పంలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. అతనికి సాయం అందించిన మరో విద్యార్థిని కూడా విచారిస్తున్నారు. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ రెండో కుమార్తె కీర్తిక(11) మాచనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.
సోమవారం సాయంత్రం కీర్తిక పాఠశాల నుంచి సైకి ల్‌పై ఒంటరిగా వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మామిడి తోటలోకి తీసుకెళ్లి కీర్తిక కాళ్లు, చేతులు కట్టి అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో వేలూరు డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. అదే విధంగా వేలూరు నుంచి రప్పించిన డాగ్ స్క్వాడ్‌తోను తనిఖీలు చేపట్టారు. కీర్తిక ఇంటికి పాఠశాలకు మూడు కిలో మీటర్ల దూరం ఉండడంతో ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఈ సంఘటన జరగడం గమనార్హం. విద్యార్థి పాఠశాల నుంచి ఎవరితో వచ్చిందనే విషయాలను ఉపాధ్యాయుల వద్ద పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం పాఠశాల ఎదుట జామ పండ్లు విక్రయించే మహిళ వద్ద విచారణ చేపట్టారు.
ఆ సమయంలో కీర్తికతో పదో తరగతి విద్యార్థి వెళ్లినట్లు మహిళ తెలిపింది. వెంటనే పోలీసులు పదో తరగతి విద్యార్థి ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందినటెన్త్ విద్యార్థి శరణ్‌రాజ్ మంగళవారం పాఠశాలకు రాలేదని తెలుసుకున్నారు. శరణ్‌రాజ్ తల్లిదండ్రుల వద్ద విచారణ జరపగా మాటలు తడబడి మాట్లాడారు. విచారణలో శరణ్‌రాజ్ హొసూరులోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ప్రత్యేక పోలీసుల బృందం హొసూరుకు వెళ్లి శరణ్‌రాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కీర్తికను హత్య చేసినట్లు అంగీకరించాడు. మరిన్ని వివరాల కోసం శరణ్‌రాజ్‌ను పరదరామి పోలీస్ స్టేషన్‌కు తీసుకె ళ్లి రహస్యంగా విచారణ చేస్తున్నారు.
శరణ్‌రాజ్ కొద్ది రోజులుగా కీర్తికపై కన్నేసి పరిచయం పెంచుకున్నాడు. సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వస్తున్న కీర్తిక వద్ద శరణ్‌రాజ్ తాను ఇంటికి వెళుతున్నానని ఇద్దరూ కలిసి వెళదామని చెప్పాడు. అనంతరం పాఠశాల ముందున్న మహిళ వద్ద జామ పండు తీసి ఇచ్చాడు. జామ పండు తింటూ కీర్తిక శరణ్‌రాజ్‌తో కలిసి ఇంటికి బయల్దేరింది. ఇంటికి వెళ్లే దారిలోని మామిడి తోటలో కాసేపు ఆటలాడుకుని వెళదామని శరణ్‌రాజ్ తెలిపాడు. మామిడి తోటలోకి కీర్తిక వెళ్లడంతో కాళ్లు, చేతులు కట్టి ఆటలాడుతామని శరణ్‌రాజ్ తెలపడంతో ఇవేమీ తెలియని తెలియని కీర్తిక తన రిబ్బన్, దుప్పట్టా (చున్నీ) ఇచ్చింది. దీంతో కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తన మనసులో ఉన్న మాటను చెప్పాడు. ఇందుకు కీర్తిక అంగీకరించక పోవడంతోపాటు కేకలు వేయడంతో ఆగ్రహించిన శరణ్‌రాజ్ కీర్తిక నోటికి చున్నీని కట్టేసి, బట్టలు ఊడదీశాడు.
పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కీర్తికను లొంగదీసుకునేందుకు శరణ్‌రాజ్ వల్ల కాలేదు. అరుుతే ఇంటికి వెళ్లి విషయాన్ని చెపుతుందని పక్కనున్న మద్యం బాటిళ్లతో కీర్తిక తలపై కొట్టాడు. దీంతో స్పృహ తప్పిన కీర్తిక గుండెపై బాటిల్‌తో కోశాడు. వెంటనే కీర్తిక మృతి చెందిన విషయాన్ని గమనించిన శరణ్‌రాజ్ మృత దేహాన్ని ముళ్ల చెట్ల వద్ద వేసి ఇంటికి వెళ్లిపోయాడు. రక్తపు మరకతో వచ్చిన శరణ్‌రాజ్‌ను చూసిన తల్లిదండ్రులు ఏమి జరిగిందని విచారించకుండా బంధువుల ఊరికి పంపించేశారు. అరుుతే ఈ హత్యలో శరణ్‌రాజ్‌కు సాయం మరెవరో సాయం అందించినట్లు పోలీసులకు అనుమానం వచ్చి మరో పదో తరగతి విద్యార్థిని పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నారు.
మృతదేహం తీసుకోకుండా బంధువుల రాస్తారోకో
కీర్తిక మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ కీర్తిక బంధువులు కేవీ కుప్పం -గుడియాత్తం రోడ్డులో రాస్తారోకో చేశారు. దీంతో కలెక్టర్ నందగోపాల్, డీఐజీ తమిళ్‌చంద్రన్, ఎస్పీ సెంథిల్‌కుమారి కీర్తిక బంధువులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు. కీర్తిక బంధువులకు మద్దతుగా పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రాస్తారోకోలో పాల్గొన్నారుు. దీంతో ఆ ప్రాంతంలో దుకాణాలు మూసివేశారు. పాఠశాలకు సెలవు: కీర్తిక చదువుతున్న మాచనూర్ పాఠశాలకు బుధవారం సెలవు ప్రకటించారు. ముం దుగా సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రద్ధాంజలి ఘటించారు. అదే విధంగా కేవీ కుప్పంలోని రెండు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.