విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్‌ను ఆదర్శంగా తీసకుని పరిశోధనలు చేయాలని జిల్లా విద్యాశాఖ సీఈవో మది అన్నారు
వేలూరు, న్యూస్‌లైన్: విద్యార్థులు ప్రముఖ శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్‌ను ఆదర్శంగా తీసకుని పరిశోధనలు చేయాలని జిల్లా విద్యాశాఖ సీఈవో మది అన్నారు. శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకటరామన్ 120వ జయంతి సందర్భంగా వేలూరు జిల్లా సైన్స్ సెంట ర్‌లో వీఐటీ విద్యార్థులు వివిధ పరిశోధనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మది ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా నోబుల్ బహుమతి పొందిన వ్యక్తి సర్ సీవీ.రామన్ అని గుర్తుచేశారు. ఆయన్ను ప్రతి విద్యార్థీ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులకు పరిశోధనలు చేసేందుకు అన్ని సదుపాయాలున్నాయని పేర్కొన్నారు.
సర్ సీవీ. రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం అభినందనీయమన్నారు. అనంతరం వీఐటీ విద్యార్థులు పది రకాల పరిశోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ప్రొఫెసర్ మురగేశ్వరి, చెన్నై సైన్స్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అయ్యం పెరుమాల్ పాల్గొన్నారు.