
ఆనందన్ (ఫైల్)
సాక్షి, వేలూరు: ఆన్‌లైన్ రమ్మీకి బానిసై రూ. 10 లక్షల నగదును పోగొట్టకోవడంతో.. జీవితంపై విరక్తి చెంది చెన్నై ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో చోటు చేసుకుంది. కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్(31) చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్‌లైన్ ద్వారా సెల్‌ఫోన్‌లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఖండించారు. అయినప్పటికీ రమ్మీ ఆడేవాడు.
గత వారంలో మాత్రం ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ. 10 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్నేహితుల వద్ద రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఓటు వేసేందుకు ఆనందన్ సొంత గ్రామమైన కాట్టుకొల్లై గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఓటు హక్కు వినియోగించుకొని ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆనందన్ ఆన్‌లైన్ రమ్మీ ద్వారా భారీగా నగదు పోగొట్టుకున్న విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు.
మనోవేదనకు గురై ఆనందన్ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వానియంబాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment