తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాప్
వేలూరు: ఇండియాలోనే తమిళనాడులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ షాపు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూ రు జిల్లా తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాపును కలెక్టర్ నందగోపాల్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ మెడికల్ షాపుల ద్వారా కొనుగోలు దారులకు 12 శాతం డిస్కౌంట్‌తో మందులను విక్రయించనున్నట్లు తెలిపారు. రోగులకు అందుబాటులో ఉండే విధంగా బస్టాండ్ ప్రాంతంలోనే ఈ దుకాణం ఏర్పా టు చేశామన్నారు. ఇప్పటికే కో-ఆపరేటివ్ ద్వారా వేలూరు కొత్త బస్టాండ్‌లో మందుల షాపును ప్రారంభించి రోగులకు అవసరమైన అన్ని మందులను విక్రయిస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పేర్నంబట్టులోనూ అమ్మ మెడికల్ షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే రమేష్, కో-ఆపరేటివ్ చైర్మన్ గణేశన్, యూనియన్ అధ్యక్షులు శరవణన్, జెడ్పీ చైర్మన్ లీలాసుబ్రమణ్యం, కో-ఆపరేటివ్ జాయింట్ డెరైక్టర్ తిరుగుణ అప్పాదురై, జాయింట్ రిజిస్ట్రార్ భాస్కర్ మోహన్ పాల్గొన్నారు.