tirupattur
-
ఊహించని మృత్యువు అంటే ఇదేనేమో!
సాక్షి, చెన్నై: బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ వేకువ జామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ మినీ వ్యాన్‌ను గూడ్స్ లారీ ఢీ కొట్టిన ఘటనలో ఏడుగురు బలయ్యారు. మృతులంతా మహిళలే కాగా.. అనూహ్యా రీతిలో వాళ్లు దుర్మరణం పాలవడం గమనార్హం. వెల్లూరు జిల్లా పెర్నాంబట్ టౌన్ ఓనన్ గుట్టాయ్ ప్రాంతానికి చెందిన 15 మందికి పైగా బృందం మినీ వ్యాన్‌లో మైసూరు పర్యటనకు వెళ్లారు. గత రాత్రి యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నాట్రంపల్లి సమీపంలోని నడ్రంపల్లి గ్రామం వద్ద వారి వ్యాన్ చెడిపోయింది. ఆ తర్వాత, వ్యాన్‌లోని వాళ్లంతా హైవేలో ఉన్న కాంక్రీట్ దిమ్మెలపై కూర్చున్నారు. ఆ సమయంలో అటుగా వస్తున్న గూడ్స్ లారీ ఒకటి.. బ్రేక్‌డౌన్‌లో ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఆ వ్యాన్ బోల్తా పడడంతో అక్కడ కూర్చున్న మహిళలు నుజ్జునుజ్జు అయ్యారు. అలాగే 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తోటి వాహనదారులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాయపడిన 8 మందిని చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గజరాజుల యుద్ధం మీరే చుడండి..!
-
ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలోని జిన్నాపాలెం వద్ద మురుగన్ తైపుసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల కోసం ఉచిత టోకెన్లు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది మహిళలు తరలివచ్చారు. అయితే టోకెన్ల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు.వీరిని వెంటనే వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయలపాలైన మరో 12 మంది మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఎస్పీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసిన ప్రైవేట్ సంస్థ యజమాని అయ్యప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు.. -
తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాప్
వేలూరు: ఇండియాలోనే తమిళనాడులో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ మెడికల్ షాపు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేసీ వీరమణి అన్నారు. వేలూ రు జిల్లా తిరుపత్తూరులో అమ్మ మెడికల్ షాపును కలెక్టర్ నందగోపాల్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ మెడికల్ షాపుల ద్వారా కొనుగోలు దారులకు 12 శాతం డిస్కౌంట్‌తో మందులను విక్రయించనున్నట్లు తెలిపారు. రోగులకు అందుబాటులో ఉండే విధంగా బస్టాండ్ ప్రాంతంలోనే ఈ దుకాణం ఏర్పా టు చేశామన్నారు. ఇప్పటికే కో-ఆపరేటివ్ ద్వారా వేలూరు కొత్త బస్టాండ్‌లో మందుల షాపును ప్రారంభించి రోగులకు అవసరమైన అన్ని మందులను విక్రయిస్తున్నామన్నారు. ప్రస్తుతం రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పేర్నంబట్టులోనూ అమ్మ మెడికల్ షాపును ప్రారంభించారు. ఎమ్మెల్యే రమేష్, కో-ఆపరేటివ్ చైర్మన్ గణేశన్, యూనియన్ అధ్యక్షులు శరవణన్, జెడ్పీ చైర్మన్ లీలాసుబ్రమణ్యం, కో-ఆపరేటివ్ జాయింట్ డెరైక్టర్ తిరుగుణ అప్పాదురై, జాయింట్ రిజిస్ట్రార్ భాస్కర్ మోహన్ పాల్గొన్నారు.