
కోయంబత్తూర్ ఇప్పుడు కోయంపుత్తూరు. వెల్లూర్ ఇప్పుడు వీలూరు. ఇంకా 1016 ఊళ్లు తమిళనాడులో ఇంగ్లిష్ నుంచి అచ్చ తమిళ్‌లోకి మారిపోతున్నాయి. అయితే ఈ మార్పులు ఏమంత సవ్యంగా లేవని తమిళ చరిత్రకారులు, భాషాపండితులు అంటుండటంతో తమిళనాడు ప్రభుత్వం మునుపు తనిచ్చిన ‘ఊళ్ల పేర్ల మార్పు జీవో’ ను ఉపసంహరించుకుంది. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చాక కొత్త జీవోను జారీ చేస్తామని తమిళభాష, తమిళ సంస్కృతి శాఖల మంత్రి పాండియరాజన్ ఒక ట్వీట్ ఇచ్చారు. మయిలాప్పూర్ (మైలాపుర్), తూత్తుక్కుడి (ట్యూటికొరిన్), మథురై (మదురై), తండయియార్‌పేట్టయ్ (తొండయిర్ పేట్) వంటి చాలా ప్రాంతాల ఉచ్చారణ తమిళంలోకి మార్చిన తర్వాత కూడా ఇంగ్లిషుకు ఆనుకుని ఉండటమే తమిళ భాషాభిమానులకు నచ్చడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment