ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం | Young woman abducted, molested by man in Vellore | Sakshi
Sakshi News home page

ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం

Published Wed, Nov 9 2022 3:34 PM | Last Updated on Wed, Nov 9 2022 3:35 PM

Young woman abducted, molested by man in Vellore - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై(వేలూరు): కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్పాప్‌ చేసి, ఆపై ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన కత్తారి కుప్పం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒడుగత్తూరు సమీపంలోని మేల్‌ అరసంబట్టు పంచాయతీలోని కత్తారి కుప్పం గ్రామానికి చెందిన శరత్‌కుమార్‌(27) ఊసూరు వద్ద ఉన్న ఒక బేకరి దుకాణంలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతనికి వివాహం జరిగి గతవారం ఆడశిశువు పుట్టింది. కాగా ఊసూరు గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి గుడియాత్తంలోని కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో విద్యార్థిని శని, ఆదివారాలు, సెలవు దినాల్లో ఊసూరులోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. ఈ క్రమంలో శరత్‌కుమార్‌ కన్ను ఆమెపై పడింది. ఈ క్రమంలో విద్యార్థినిపై అత్యాచారం చేయాలని నిర్ణయిచుకుని, ఏడాదిగా ఆ విద్యార్థిని ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను వెంబడిస్తున్నాడు.

ఆదివారం సాయంత్రం విద్యార్థిని వస్త్రదుకాణంలో పని ముగించుకుని, బస్సు కోసం వేచి ఉన్న సమయంలో శరత్‌కుమార్‌ అక్కడ వేచి ఉంటూ ఎవరూ లేని సమయంలో విద్యార్థిని చేతులు పట్టుకుని ముళ్ల చెట్ల మధ్యకు తీసుకెళ్లడంతో విద్యార్థిని కేకలు వేసింది. వెంటనే చేతులు కట్టి, నోట్టో గుడ్డపెట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయట పెడితే హత్య చేస్తానని బెదిరించాడు.

అనంతరం జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి పొక్సో చట్టం కింద అరెస్టు చేసి, సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

చదవండి: (రెండేళ్ల క్రితం ఇష్టంలేని పెళ్లి.. ప్రియుడ్ని మరిచిపోలేక..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement