వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడులోని ఆంధ్ర సరిహద్దులోని 11 ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నట్లు ఎస్పీ సెంథిల్‌కుమారి తెలిపారు. వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న వేలూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పోలీసులతో శాంతి భద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్విహ స్తున్నట్లు తెలిపారు.
అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రతి విషయాన్ని గమనించనున్నట్లు తెలిపారు. వేలూరులో కొంత మంది చోరీలు, అలజడి సృష్టించి చిత్తూరులో వె ళ్లి తల దాచుకుంటున్నారని అటువంటి వారిని పట్టుకునేందుకు చిత్తూరు పోలీసులు సహకరించాలన్నారు. వేలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన సేర్‌కాడు, క్రిష్టియన్‌పేట, పరదరామి, మాదకడప వంటి నాలుగు ప్రాంతాల్లో మొదటి విడతగా సిసిటీవి కెమరాలను అమర్చనున్నట్లు తెలిపారు. అనంతరం మిగిలిన ప్రాంతాల్లో కెమరాలు ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ వేలూరు, చిత్తూరు జిల్లాల్లో చోరీలు, నేరాలను అదుపు చేసేందుకు ఇరు జిల్లాల పోలీసులు సలహాలను ఇవ్వడంతోనే పలు కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం నరికి తెచ్చే వారిలో వేలూరు జిల్లాకు చెందిన వారు అధికంగా ఉన్నారని ఈ తరలింపును అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వేలూరు నుంచి చిత్తూరుకు రిజిస్ట్రేషన్ వాహనాలు అధికంగా వస్తున్నాయని వాటిని స్వాధీనం చేసుకొని మీకు సమాచారం అందజేస్తామని వేలూరు పోలీసులు నేరుగా వచ్చి వాటిని స్వాధీనం చేసుకొని విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు అడిషనల్ ఎస్పీ అభిషేక్ మొహంతి, డీఎస్పీలు బాలక్రిష్ణన్(వేలూరు) రత్నా(చిత్తూరు) వేలూరు డీఎస్పీలు పన్నీర్‌సెల్వం, వరదరాజన్, మదివాణన్‌లతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన డీఎస్పీలు, ఇన్సెపెక్టర్‌లు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ప్రత్యేక కెమెరాలతో నిఘా
Published Thu, Jan 28 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM
Advertisement
Advertisement