బాలిక మృతదేహం లభ్యం | gril dead body Available | Sakshi
Sakshi News home page

బాలిక మృతదేహం లభ్యం

Published Fri, Jun 6 2014 2:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

gril dead body Available

 వేలూరు, న్యూస్‌లైన్:వేలూరులో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ కాలువలో కొట్టుకు పోయిన బాలికను 60 గంటలు పోరాడిన అనంతరం కలెక్టరేట్ సమీపంలో గురువారం ఉదయం ఏడు గంట లకు మృత దేహంగా కనుగొన్నారు.  జార్ఖండ్ రాష్ట్రం కిరిడి జిల్లాకు చెందిన  ప్రియాంక (14) ఈనెల 2వతేదీ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  వేలూరు ప్యాలెస్ క్యాప్ వద్ద గాలించినప్పటికీ బాలిక ఆచూకీ తెలియరాలేదు. దీంతో కాలువ ఎక్కెడెక్కడ వెళుతుందో ఆ ప్రాంతాలన్నీ జేసీబీ ప్రొక్లెయినర్ ద్వారా డ్రైనేజీ కాలువలతోపాటు, కట్టడాలను కూడా తొలగించి గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా సీఎంసీ ఆస్పత్రి రోడ్డు, కాట్పాడి రోడ్డులను మూసివేసి గుంతల వద్ద పూర్తిగా తవ్వి గాలించినా ఫలితం లేదు.
 
 దీంతో మంగళవారం సాయంత్రం అరక్కోణంలోని ఐఎన్‌ఎస్ రాజాళీ నౌకా సిబ్బంది 10 మందిని రంగంలోకి దింపారు. నౌకా సిబ్బంది మూడు టీమ్‌లుగా ఏర్పడి బేరి సుబ్రమణ్య స్వామి వీధి నుంచి సీఎంసీ రోడ్డు, ప్యాలెస్ క్యాప్, తోటపాళెంం, రివరీ హోటల్, కలెక్టరేట్ సమీపంలోని డ్రైనేజీ కాలువలు ఎక్కెడెక్కడ వెలుతాయో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. వీరితో పాటు కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది కూడా గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. రాజాళీ నౌకా సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో బుధవా రం సాయంత్రం అరక్కోణం వెనుతిరిగి వెళ్లా రు.దీంతో కార్పొరేషన్ కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపుచర్యలను బుధవారం సా యంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగించారు.
 
 కాంట్రాక్టు కార్మికులు
 గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికులు సుకుమార్ అధ్యక్షతన ముగ్గురు రివేరా హోటల్ నుంచి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో కలెక్టరేట్ వెనుక వైపున ఉన్న డ్రైనేజీ కాలువలోని కుప్పల్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై అగ్నిమాపక సిబ్బందికి, కార్పొరేషన్ అధికారులకు కార్మికులు సమాచారం అందించారు. వెంటనే కార్పొరేషన్ అధికారులు ప్రొక్లెయినర్ సాయంతో ఉదయం 7.30 గంటల సమయంలో ప్లాస్టిక్ కుప్పలను తొలగించారు. బాలిక మృతదేహం ఉన్నట్లు గుర్తించి దారం సాయంతో ప్రొక్లెరుునర్ ద్వారా కాలువ నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, మేయర్ కార్తియాయిని, కమిషనర్ జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
 మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం
 బేరి సుబ్రమణ్యస్వామి వీధిలో బాలిక గల్లంతు కావడంతో ఆ ప్రాంతం నుంచి సుమారు ఒక కిలో మీటరు వ రకు జేసీబీల సాయంతో డ్రైనేజీ కాలువలను తవ్వి గాలించారు. అయినప్పటీకీ ఆచూకీ తెలియక పోవడంతో మట్టిలో కూరుకుపోయి ఉండవచ్చని జేసీబీ ద్వారా మట్టిని పూర్తిగా తొలగించారు. అయితే బాలిక మూడు కిలో మీటర్ల దూరం వరకు వరద నీటిలో కొట్టుకుపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
 
 వేలూరులోనే అంత్యక్రియలు
 జార్ఖండ్‌కు చెందిన బాలిక ప్రియాంక మృతదేహానికి వేలూరులోనే అంత్యక్రియలు చేసేందు కు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ నందగోపాల్, ఎస్పీ విజయకుమార్, మేయర్, కమిషనర్ ప్రియాంక మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. టోల్‌గేట్‌లోని సీఎస్‌ఐ కల్లరలో క్రైస్తవ లాంఛనాల మధ్య ప్రత్యేక ప్రార్థనలు చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు.
 
 కన్నీరు మున్నీరైన ప్రియాంక కుటుంబ సభ్యులు
 బాలిక ప్రియాంక మృత దేహాన్ని చూసిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తండ్రి ఇంద్రజిత్ ముఖర్జీ, తల్లి సుచిత్ర, ప్రియాంక అన్న అమిదీశ్వరన్, వదిన సీమా కన్నీరు మున్నీరు అయ్యారు. మూడు రోజులుగా తమ కుమార్తె సజీవంగా దొరకాలని చేసిన ప్రార్థనలన్నీ వృథా అయ్యూరుు. కుటుంబీకులు మృత దేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు.
 
 కాంట్రాక్టు కార్మికులు పర్మినెంట్
 బాలిక కోసం రాత్రి, పగళ్లు కష్టపడి గాలింపు చర్యలు చేపట్టిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులను కలెక్టర్ అభినందించారు. ఆ కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నట్లు కలెక్టర్‌కు తెలిసింది. దీంతో కాంట్రాక్టు కార్మికులు కుమా ర్, మదన్, సంతోష్‌ను పర్మినెంట్ చేయాలని కమిషనర్ జానకిని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులుగా గాలింపు చర్యల్లో పాల్గొన్న పారిశుద్ధ్య కార్మికులతోపాటు, పోలీస్, రెవె న్యూ, అగ్నిమాపక అధికారులను కలెక్టర్ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement