వేలూరు: అభం శుభం ఎరుగని బాలి కపై అత్యాచారం చేసి, హత్య చేసి మృత దేహాన్ని బావిలో వేసిన ఆల య పూజారికి వేలూరు మహిళా కోర్టు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వేలూ రు జిల్లా గుడియాత్తం పాండియనగర్ వినాయక గుడి వీధికి చెందిన కుమార్(50) అదే గ్రామంలోనే ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని ఇంటి ముందున్న ప్రభుత్వ పాఠశాలలో కాళియమ్మన్ పట్టణం గ్రామానికి చెందిన రాజ కుమార్తె రాజేశ్వరి(7) రెండో తరగతి చదువుతుంది. 2011 సెప్టెంబర్ 19న పాఠశాలకు వెళ్లిన రాజేశ్వరి ఇంటికి రాలేదు. మూడు రోజుల అనంతరం అదే ప్రాంతంలోని ఒక వ్యవసాయ బావిలో రాజేశ్వరి మృతదేహం లభ్యమైంది.
అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి రాజేశ్వరి హత్య కేసుపై విచారణ చేపట్టారు. విచారణలో రాజేశ్వరిని అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి కుమార్ చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఇంటిలోని పెద్దవారికి విషయం చెబుతుందని భయపడి, హత్య చేసి సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో వేసిన ట్లు నిర్ధారణ అయింది. దీంతో కుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు వేలూరు మహిళా కోర్టుకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తి నజీర్ అహ్మద్ కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినందుకు పది సంవత్సరాలు, హత్య చేసినందుకు పది సంవత్సరాలు, హత్య ను చెప్పకుండా దాచినందుకు మూడేళ్లు మొత్తం 23 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా అపరాధ రుసుముగా రూ.5 వేలు చెల్లించాలని తీర్పునిచ్చా రు. దీంతో కుమార్‌ను పోలీసులు వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
ఆలయ పూజారికి 23 ఏళ్ల జైలు
Published Thu, Mar 26 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM
Advertisement
Advertisement