ఆరు ఏనుగుల పట్టివేత
Published Fri, Aug 30 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM
వేలూరు, న్యూస్‌లైన్: తిరువణ్ణామలై, ధర్మపురి, క్రిష్ణగిరి, విల్లుపురం జిల్లాల్లో తిరుగుతూ సంచలనం సృష్టించిన ఆరు అడవి ఏనుగులను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు. ఈ జిల్లాల్లో సాగులో ఉన్న పంటలను ఈ ఏనుగులు ధ్వంసం చేసేవి. అలాగే ఇప్పటి వరకు ఈ ఏనుగుల దాడుల్లో 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు మల్కాణి, కళ్యాణ సుందరం ఆధ్వర్యంలో ఏనుగులను పట్టుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి ఆపరేషన్ హిల్‌గా పేరుపెట్టారు. ఈ నెల 27 నుంచి ఆఫరేషన్లు ప్రారంభిం చారు. మత్తు మందును తూటాల ద్వారా వేసి నాలుగు ఏనుగులను పట్టుకున్నారు. మగ ఏనుగును మాత్రం బుధవారం ముదుమలైకి లారీలో తరలించారు.
మిగి లిన ఏనుగులను పట్టుకునేందుకు ఆడ ఏనుగులను తండ్రాంబట్టు ప్రాంతం వద్ద చెట్లుకు కట్టి ఉంచారు. ఆడ ఏనుగు వద్దకు మిగిలిన రెండు పిల్ల ఏనుగులు చేరుకున్నాయి. ఈ సమయంలో వెటర్నరీ వైద్యాధికారి మనోహరన్ ఆధ్వర్యంలో పిల్ల ఏనుగులకు తక్కువ మో తాదుతో ఇంజెక్షన్ వేశారు. రాత్రి 9.30 గంటల సమయంలో వాటిని పట్టుకున్నారు. అనంతరం అన్ని ఏనుగులనూ ఇనుప గొలుసులతో కట్టి పెట్టారు. ఆపై గురువారం ఉదయం ఒక్కో ఏనుగును వేర్వేరు లారీల్లో పెలైట్ వాహనాల మధ్య తరలించారు. వీటిలో రెండు ఏనుగులను ఆనమలైకి, మరో నాలుగు ఏనుగులను ముదుమలైకి తరలించారు. ఈ ఏనుగులకు మత్తు వ ది లేలోపు 12 గంటల సమయంలోనే ఆయా శిక్షణ కేంద్రాలకు తరలించారు.
రైతుల హర్షం
తండ్రాబట్టు ప్రాంతంలో ఆరు ఏనుగులను ఆపరేషన్ హిల్ ద్వారా పట్టుకొని విజయం సాధించడంతో అటవీశాఖ అధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో ఎప్పుడేమి జరుగుతుందోనని అటవీశాఖ అధికారులు గాబరాపడ్డారు. ఎట్టకేలకు ఏనుగులను పట్టుకొని విజయం సాధించడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
Advertisement