ప్రేమజంట ఆత్మహత్య
- పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని రైలు కిందపడి బలవన్మరణం
వేలూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కాట్పాడిలో చోటు చేసుకుంది. కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురం గ్రామానికి చెందిన రాబర్ట్ కుమారుడు వర్కీస్(25) పట్ట భద్రుడు. అదే గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు మణికుమార్తె కలైఅరసి(24). వీరు పాఠశాల విద్య నుంచే ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు.
కలైఅరసికి మరొకరితో వివాహం జరిపేందుకు నిశ్చితార్థం నిర్వహించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మనస్తాపం చెంది శనివారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా వర్కీస్, కలైఅరసి ఇద్దరూ బ్రహ్మపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి కాట్పాడి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.