Love couple commits suicide
-
ఇద్దరూ బంధువులే.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని..
సాక్షి, ఆదిలాబాద్: వారిద్దరూ బంధువులే.. వరుసకు బావా మరదల్లే.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు విషయం చెప్పారు. మూడు నెలలుగా కలిసి ఉంటున్నారు. అయితే పెళ్లి విషయంపై పెద్దలు ఎటూ తేల్చకపోవడంతో మనస్తాపం చెందారు. బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్‌గావ్‌లో జరిగింది. నార్నూర్ సీఐ ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం.. నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామానికి చెందిన సీడాం మారు(21) నిర్మల్ జిల్లా పెంబి మండలం పస్పుల గ్రామానికి చెందిన ఆత్రం రాంబాయి(20) వరుసకు బావా మరదళ్లు. మారు తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో అతని వేనమామ పస్పుల గ్రామానికి చెందిన చిన్నభీమ చోర్గావ్ గ్రామంలోనే మారుకు పాలేరుగా పనికి కుదిర్చారు. ఈ క్రమంలో మేనమామ కూతురు రాంబాయి తరచూ మారు ఇంటికి వచ్చి వెళ్లేంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని రాంబాయి తల్లి దండ్రులకు చెప్పారు. వారు తమ నిర్ణయం చెప్పకపోవడంతో రాంబాయి మూన్నెళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి మారుతో కలిసి చోర్‌గావ్‌లో ఉంటోంది. అయినా పెళ్లిపై పెద్దల నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో మనస్తాపం చెందారు. పెళ్లి చేసుకున్నా కలిసి జీవించలేమనుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లోనే దూలానికి ఉరివేసుకున్నారు. ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో గ్రామస్తులు తలుపు తీసి చూడడంతో ఇద్దరూ చనిపోయి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ ప్రేమ్‌కుమార్, ఇన్చార్జి ఎస్సై ఇమ్రాన్ ఘటన స్థలానికి చేరుకుని çపంచనామా నిర్వహించారు. మారు అన్న సిడాం కన్నిరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై తెలిపారు. -
అతను మేజర్.. ఆమె మైనర్.. ఇంట్లో చెప్పలేక..
సాక్షి, కోస్గి (నారాయణపేట): అతను మేజర్.. ఆమె మైనర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పలేక ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. బాలిక కుటుంబీకులు యువకుడిపై కిడ్నాప్, డబ్బు దొంగతనం కేసు పెట్టారు. మూడ్రోజులు గడిచింది. విడిపోయి బతకలేమనుకున్నారో ఏమో చెట్టుకు ఉరేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం బోగారం శివారులోని అమ్లికుంటలో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం హుస్సేన్‌పూర్‌కు చెందిన యువకుడు శివకుమార్ (20) తల్లిదండ్రులు వెంకటయ్య, పద్మమ్మతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని నాగులపల్లికి చెందిన పదో తరగతి బాలిక (15) ప్రేమలో పడ్డాడు. ఈ నెల 27న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. బాలిక కుటుంబీకులు వాకబు చేయగా ప్రేమ విషయం బయటపడటంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో మైనర్ కిడ్నాప్‌తో పాటు డబ్బులు దొంగతనం జరిగినట్టు శివకుమార్, అతని కుటుంబీకులపై ఫిర్యాదు చేశారు. చదవండి: (యువతికి రూ.50 వేలు బురిడీ.. వైన్ ఆర్డర్ చేసి అగచాట్లు) ఇరు కుటుంబాలు రాజీ చేసుకొని రెండ్రోజుల్లో బాలికను అప్పగిస్తామని లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. ఇంతలో గురువారం సాయంత్రం కోస్గి మండలంలోని బోగారం చెరువు సమీపంలో అమ్లికుంటకు చెందిన ఓ రైతు పొలంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్టు కొందరు రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి ప్రాథమికంగా విచారించగా సదరు ప్రేమజంటనే అని తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు ప్రాణాలను బలితీసుకున్న ప్రేమ
కర్ణాటక / మండ్య : పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్న తమను ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఇవ్వడం లేదంటూ డెత్‌నోట్ రాసి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జిల్లాలోని మళవళ్లి తాలూకా అంచెదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.తాలూకాలోని హెబ్బకవాడి గ్రామానికి చెందిన నవీన్(26),నందిని(21)లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువురి పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో నెల రోజుల క్రితం మరో ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరువురు అంచెదొడ్డి గ్రామానికి చేరుకొని నివాసం ఉంటున్నారు. అయితే తాము వివాహం చేసుకోవడం ఇష్టం లేని తమ పెద్దలు తమను ప్రశాంతంగా ఉండనివ్వలేదని డెత్‌నోట్ రాసి ఒకే తాడుతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మళవళ్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య
తమిళనాడు : తేని జిల్లా పూందిపురం సమీపంలో వెళ్లి విళుందుతాన్ పారై అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ సంఘటనను చూసిన స్థానికులు, అటవీశాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి విచారణ జరిపారు. విచారణలో ఆ ఇద్దరూ తిరుపూరుకు చెందిన మహేశ్వరి, పూదిపురానికి చెందిన శివకామి అని తెలిసింది. వీరిద్దురు ప్రేమికులని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు మొదటిస్థాయి విచారణలో తెలిసింది. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని కుళితలై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ప్రేమజంట ఆత్మహత్య
- పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని రైలు కిందపడి బలవన్మరణం వేలూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఉదయం కాట్పాడిలో చోటు చేసుకుంది. కాట్పాడి సమీపంలోని బ్రహ్మపురం గ్రామానికి చెందిన రాబర్ట్ కుమారుడు వర్కీస్(25) పట్ట భద్రుడు. అదే గ్రామానికి చెందిన కూలీ కార్మికుడు మణికుమార్తె కలైఅరసి(24). వీరు పాఠశాల విద్య నుంచే ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు. కలైఅరసికి మరొకరితో వివాహం జరిపేందుకు నిశ్చితార్థం నిర్వహించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మనస్తాపం చెంది శనివారం ఉదయం కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా వర్కీస్, కలైఅరసి ఇద్దరూ బ్రహ్మపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి కాట్పాడి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని విచారణలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ జంట ఆత్మహత్య
తిరువొత్తియూరు: అరియలూరు వద్ద శనివారం ఉదయం 2.30 గంటల సమయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చెన్నై నుంచి తిరుచ్చికి వెళుతున్న మలైకోటై ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు అరియలూరు ఏసీ గేటు వద్ద రైలు వస్తుండగా రైలు పట్టాలపై ఓ యువకుడు, ఓ యువతి నిలబడివున్నారు. వీరినిచూసి దిగ్భ్రాంతి చెందిన ఇంజిన్ డ్రైవర్ వారిని దూరంగా తొలగిపొమ్మని చేయి చూపిస్తూ హెచ్చరించారు. రైలు ప్రేమజంటను ఢీకొంది. ఈ ఘటనలో వారు మృతి చెందారు. రైలు డ్రైవర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో ప్రేమికుడు సేలం జిల్లా నంగవల్లి గ్రామం గోమతి కాంప్లెక్స్‌కు చెందిన మణికుమారుడు మారిముత్తు (29), కరూర్ జిల్లా అవరం కురిచ్చ పెరియస్వామి కుమార్తె సుగుణ (20) అని తెలిసింది. వీరి ప్రేమను పెద్దలు తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.