కర్ణాటక / మండ్య : పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్న తమను ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఇవ్వడం లేదంటూ డెత్‌నోట్ రాసి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జిల్లాలోని మళవళ్లి తాలూకా అంచెదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది.తాలూకాలోని హెబ్బకవాడి గ్రామానికి చెందిన నవీన్(26),నందిని(21)లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరువురి పెద్దలు వ్యతిరేకత వ్యక్తం చేశారు.
దీంతో నెల రోజుల క్రితం మరో ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరువురు అంచెదొడ్డి గ్రామానికి చేరుకొని నివాసం ఉంటున్నారు. అయితే తాము వివాహం చేసుకోవడం ఇష్టం లేని తమ పెద్దలు తమను ప్రశాంతంగా ఉండనివ్వలేదని డెత్‌నోట్ రాసి ఒకే తాడుతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మళవళ్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment