అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య
తమిళనాడు : తేని జిల్లా పూందిపురం సమీపంలో వెళ్లి విళుందుతాన్ పారై అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ సంఘటనను చూసిన స్థానికులు, అటవీశాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి విచారణ జరిపారు.
విచారణలో ఆ ఇద్దరూ తిరుపూరుకు చెందిన మహేశ్వరి, పూదిపురానికి చెందిన శివకామి అని తెలిసింది. వీరిద్దురు ప్రేమికులని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు మొదటిస్థాయి విచారణలో తెలిసింది. వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని కుళితలై పోలీసులు విచారణ జరుపుతున్నారు.