కొంపముంచిన అవినీతి!
Published Sat, Sep 7 2013 3:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
అవినీతి వ్యవహారాల కారణంగానే వైగై సెల్వన్‌ను మంత్రి వర్గం నుంచి ఇంటికి సాగనంపినట్లు తెలుస్తోంది. సహచర మంత్రులతోనూ ఈయనకు సఖ్యత లేనట్లు సమాచారం. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న జయలలిత వైగై సెల్వన్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు ప్రచారం సాగుతోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాఠశాల విద్య, క్రీడలు, మహిళా సంక్షేమం, అధికార తమిళభాష, సంస్కృతి శాఖల మంత్రిగా డాక్టర్ వైగెసైల్వన్ వ్యవహరించేవారు. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ప్రకటించారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం కలిగించింది. అదే సమయంలో వైగెసైల్వన్‌కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నా రుు. మదురై, మేలూరు, ఉసిలంపట్టిలోని ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్, పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో ప్రభుత్వాధినేతల సిఫార్సుల ప్రమేయం, అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఉసిలంపట్టికి చెందిన గణేశన్ అనుమానించాడు.
సమాచార హక్కు చట్టం కింద ఆయూ నియామకాల వివరాలు కోరుతూ మండల విద్యాశాఖాధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. మదురె, మేలూరు అధికారులు స్పందించలేదు. ఉసిలంపట్టి అధికారి ఇచ్చిన వివరాల్లో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నట్లు తేటతెల్లమైంది. దీంతో బాధితుడు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో మిగిలిన ఇద్దరు మండల విద్యాశాఖాధికారులు సైతం వివరాలను కోర్టుకు సమర్పించారు.
తాము సూచించినవారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు ఆదేశించారని అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. తమకు చెన్నై నుంచి ఎవరో ఫోన్ చేశారని అధికారులు సమాధానం ఇచ్చారు. వీరి సమాధానంతో ఆగ్రహించిన న్యాయమూర్తి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదంటూ నిలదీశారు. ప్రభుత్వంలోని వారు ఉద్యోగాలు పంచుకోవడంపై ధర్మాసనం మండిపడింది. ఫలితంగా గురువారం సాయంత్రానికి కల్లా మంత్రి వర్గం నుంచి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి వైగై సెల్వన్ ఉద్వాసనకు గురయ్యూరు.
అవినీతి బద్ఙిలీలలురూ.
ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలపై కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే మంత్రి వైగైను తప్పించడానికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. వైగై పట్ల సహచర మంత్రివర్గ సభ్యులు, పార్టీనేతలే గుర్రుగా ఉంటున్నట్లు ఉద్వాసన తర్వాత వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీ, పాఠశాలల అప్‌గ్రేడ్ వ్యవహారాల్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో వైగై తీరు వివాదాస్పదంగా మారింది. రెండురోజుల క్రితం తన సొంతూరుకు బయలుదేరిన వైగై సెల్వన్ వెంట 500 కారులు అనుసరించినట్లు, కారు దిగగానే గజరాజు చేత ఆయన మెడలో స్వాగత మాల వేయించుకున్నట్లు అమ్మకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇన్నిరకాల వివాదాల్లో కూరుకుపోయి ఉన్న వైగై సెల్వన్‌ను నియామకాల ఆరోపణలే అదునుగా ఉద్వాసన పలికినట్లు వెల్లడైంది.
Advertisement
Advertisement