సాక్షి, చెన్నై: కారు, బంగ్లా, బంగారం ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడికి 25 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు యత్నించిన తల్లిదండ్రులను అధికారులు అడ్డుకున్నారు. వివరాలు.. వేలూరు సమీపంలోని అరియూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు. ఇతని బంధువైన 25 ఏళ్ల యువతికి ఇది వరకే వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు కుమార్తెకు మరో వివాహం చేయాలని నిర్ణయించారు.
ఇందుకు తమ బంధువుల్లో ఒకరికి కారు, బంగారం, బంగ్లాను కట్నంగా ఇస్తానని ఆశ చూపించి 18 ఏళ్ల యువకుడితో పెళ్లి నిర్ణయించారు. వివాహ ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. అయితే ఇందుకు యువకుడి తల్లి, సోదరి వ్యతికించారు. వీటిని పట్టించుకోకుండా యువకుడి తండ్రి ఈనెల 12న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లును సిద్ధం చేశాడు. దీనిపై యువకుడి తల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది.
దీంతో అధికారులు, అరియూర్ పోలీసులు గురువారం ఉదయం యువకుడి ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. యువకుడికి 18 ఏళ్లు పూర్తి అయినట్లు తెలిసింది. అయితే పురుషుడికి వివాహ వయస్సు 21 ఏళ్లు పూర్తి అయ్యి ఉండాలని ఆ లోపు వివాహం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు యువకుడి తండ్రిని హెచ్చరించారు. వివాహాన్ని ఆపేయాలని సూచించారు. చదవండి: మిస్డ్‌కాల్‌తో పరిచయం.. వివాహేతర సంబంధం.. ఆపై..!
Comments
Please login to add a commentAdd a comment