
ఉక్రెయిన్ యువతితో వేలూరు యువకుడి వివాహం
వేలూరు : ఉక్రెయిన్ యువతిని వేలూరు యువకుడు ప్రేమించి... హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కాట్పాడికి చెందిన బలరామన్ కుమారుడు బాలాజీ జర్మనీలో ఐటీ కంపెనీలో పదేళ్లుగా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో ఉక్రెయిన్ దేశానికి చెందిన లసియా అనే యువతి కూడా పని చేస్తోంది. భారతీయ సంప్రదాయంపై మక్కువ కలిగిన లసియా తరచూ ఆ విషయాలను బాలాజీని అడిగి తెలుసుకునేది.
ఈ సందర్భంగా వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని బాలాజీ తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు అంగీకరించారు. వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.