
సాక్షి, చెన్నై : భార్య ప్రియుడితో తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి వేలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ధర్నా చేశాడు. వేలూరు జిల్లా, భారతీదాసన్ వీధికి చెందిన సతీష్‌కుమార్ (40)కు, అదే ప్రాంతానికి చెందిన మహిళతో గత ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడటంతో ఇరువురు తరచుగా గొడవపడేవారు. ఇలా ఉండగా సతీష్‌కుమార్ భార్యకు అదే ప్రాంతానికి చెందిన సిలంబరన్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో సతీష్‌కుమార్ భార్యను మందలించాడు. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. అంతేకాకుండా సతీష్‌కుమార్‌ను చంపేస్తానంటూ సిలంబరసన్ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో సతీష్‌కుమార్ సోమవారం వేలూరు కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేశాడు. తనకు సిలంబరసన్‌తో ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని నినాదాలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment