వేలూరు, న్యూస్‌లైన్:
దేశంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోనే దేశాభివృద్ధి తప్పక సాధ్యమని వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ తెలిపారు. వీఐటీ లో గురువారం ఉదయం జీన్స్, పర్యావరణం, శరీరక వ్యాధి సంబంధమైన మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది. వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దేశంలో ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాటికి పరిశోధకులు మందులు కనిపెట్టాలన్నా రు. చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల ను కొంతవరకు తగ్గించవచ్చునన్నారు. ఇతర దేశాలకు దీటుగా మన దేశంలో కూడా పర్యావరణం అభివృద్ధి చెందాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో బెంగళూరు జాతీయ విద్యా కమిటీ సభ్యులు లత పిళ్లై, భారతీయార్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ మారిముత్తు, వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్, ప్రొఫెసర్ నారాయణన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ పాల్గొన్నారు.
ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి
Published Fri, Dec 20 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement