ఘనంగా మహా కుంభాభిషేకం
Published Sat, Aug 24 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు మేల్ చెంగానత్తం కొండపై వెలిసిన మారియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకాన్ని శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శశికుమార్ స్వాముల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్, యూనియన్ మాజీ అధ్యక్షులు దేవేంద్రన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కళశాలలో ఉంచిన పుణిద నీటిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ గోపురంపై పోశారు.
అనంతరం భక్తులపై చల్లారు. అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ మహా కుంభాభిషేకంలో సర్పంచ్ రవి పాల్గొన్నారు. అదేవిధంగా వేలూరు రంగాపురం పూంగావనతమ్మన్ ఆలయంలో అమ్మవారికి 108 పాల బిందెలతో అభిషేకం చేశారు. అంతకుముందు మహిళలు పాల బిందెలను తలపై పెట్టుకుని మేళ తాళాల నడుమ ప్రదర్శనగా ఆలయానికి వచ్చా రు. ఆపై పూజలు నిర్వహించారు.
Advertisement
Advertisement