వేలూరు: ప్రేమ వివాహం చేసుకున్నందుకు గ్రామ బహిష్కరణ చేయడంతో తమ చిన్నారికి పాలు కూడా తీసి ఇవ్వలేక పోతున్నామని ఒక ప్రేమ దంపతులు కలెక్టరేట్‌కు చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి మణివణ్ణన్‌కు వినతి పత్రం అందజేసి కన్నీరు మున్నీరయ్యారు. అరక్కోణం తాలుకా మేలపులం మోటూరు గ్రామానికి చెందిన యువన్య, ఈమె భర్త పార్తిబన్ వేర్వేరు కులాలకు చెందిన వారు అయినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వంత్ అనే ఎనిమిది నెలల కుమారుడున్నారు. ఈ నేపథ్యంలో యువన్య భర్త కుమారుడితో కలిసి కలెక్టరేట్ చేరుకొని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా యువన్య ఇచ్చిన ఫిర్యాదులో తాను తన భర్త వేర్వేరు కులాలకు చెందిన వారు తాము 2014 ఫిబ్రవరి 2వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాం. వేర్వేరు కులాలు కావడంతో గ్రామ పెద్దలు తమను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలో నీరు పట్టేందుకు నిబందన ఉంచారు, గ్రామంలో ఎటువంటి వసతులు పొందలేక తమను బహిష్కరణ చేశారని దీంతో తమ కుమారునికి పాలు కూడా కొనలేక పక్క గ్రామంలోకి వెళ్ళి పాలను తీసుకురావాల్సి ఉందని అధికారులు స్పందించి తమకు అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన డీఆర్‌వో మణివణ్ణన్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యువ దంపతులు వెనుతిరిగి వెళ్లారు.
ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు బహిష్కరించారు
Published Sat, Jul 25 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM
Advertisement
Advertisement