వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. టాస్మాక్ దుకాణాలకు బాటిళ్లను తీసుకు వెళుతున్న
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
Nov 28 2013 1:22 AM | Updated on Nov 6 2018 4:55 PM
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. టాస్మాక్ దుకాణాలకు బాటిళ్లను తీసుకు వెళుతున్న మీనీ వ్యాన్‌ను ఆర్కాడ్ సమీపంలో లారీ ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.తిరువణ్ణామమలై జిల్లా మునియతాం గాల్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్మాక్ బాటిళ్లతో మినీ వ్యాన్ బుధవారం ఉదయం వేలూరు నుంచి ఆర్కాడుకు బయలుదేరింది. మినీ వ్యాన్ ఆర్కాడు సమీపంలోని బైపాస్ రోడ్డు దాటుతుండగా ఆర్కాడు నుంచి వేలూరు వైపు వస్తున్న కంటైనర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్కాడు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా వేలూరు శలవన్‌పేటకు చెందిన సెంథిల్(20), నాథన్(28) దిండివనానికి చెందిన మినీ వ్యాన్ డ్రైవర్ అరివయగన్(26) అని తెలిసింది. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆర్కాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
తిరువణ్ణామలై జిల్లాలో...
తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సందవాసల్‌లో సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నారుు. రోడ్డు పనులు చేసేందుకు అనంతల, చిన్న అనంతల గ్రామాల నుంచి 15 మంది కార్మికులు వెళ్లారు. మంగళవారం సాయంత్రం పనులు ముగించుకొని మినీ వ్యాన్‌లో ఇంటికి బయలు దేరారు. మినీ వ్యాన్ మునియ తాంగల్ గ్రామం వద్ద వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదపుతప్పడంతో వ్యాన్ డ్రైవర్ గావు కిర ణ్ మట్టి రోడ్డుపక్కకు తిప్పాడు. దీంతో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏలుమలై(45), తంగం(35), తిరుమలై(38) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఒకే గ్రామానికి చెందిన కార్మికులు కావడంతో గ్రామంలోని వారు శోక సముద్రంలో మునిగి పోయారు. గాయపడ్డవారినికి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కన్నమంగళం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement