అప్పుడు తల్లి.. ఇప్పుడు కుమార్తె  | Minor Girl Molested By Man In Tamilnadu Same As Her Mother | Sakshi
Sakshi News home page

అప్పుడు తల్లి.. ఇప్పుడు కుమార్తె 

Published Sat, May 1 2021 6:55 AM | Last Updated on Sat, May 1 2021 8:53 AM

Minor Girl Molested By Man In Tamilnadu Same As Her Mother - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: తల్లికి జరిగిన ఘోరమే కుమార్తెకు జరిగింది. 12 ఏళ్ల వయసులో తల్లి లైంగిక దాడికి గురికాగా ప్రస్తుతం ఆమె 11 ఏళ్ల కుమార్తె సైతం లైంగిక దాడికి గురై 9నెలల గర్భం దాల్చిన దారుణ ఘటన చెన్నై వాషర్‌మెన్‌పేటలో చోటుచేసుకుంది. పార్థసారధి వీధికి చెందిన ఆటోడ్రైవర్‌ రాజా (36) అదే ప్రాంతానికి చెందిన ఇంద్రాణి (45)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచుగా ఇంద్రాణి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇంద్రాణి 11 ఏళ్ల మనవరాలుపై పలుమార్లు లైంగికి దాడికి పాల్పడ్డాడు.

గత ఏడాది నవంబరులో ఇంద్రాణి మృతిచెందగా, రెడ్‌హిల్స్‌లో నివసించే తల్లి ఇంటికి బాలిక చేరుకుంది. ఈమె తన కుమార్తెను చెన్నైలోని స్నేహితురాలి ఇంట్లో చేర్చింది. బాలిక కడుపు నానాటికి పెద్దదవడంతో స్కాన్‌ తీసి తీయగా 9 నెలల గర్భవతిగా తెలిసింది. తల్లికి విషయం చెప్పి వాషర్‌మెన్‌పేట మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

రాజాను పోక్సో చట్టం కింద గురువారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో బాలిక తల్లి 12 ఏళ్ల వయసులో లైంగికదాడికి గురై బాలికకు జన్మనిచ్చింది. దీంతో తన తల్లి ఇంద్రాణికి బిడ్డను అప్పగించి వేరొకరిని వివాహమాడి రెడ్‌హిల్స్‌లో నివసిస్తోంది. బాలిక తల్లిపై జరిగిన లైంగిక దాడి కేసు మాధవరం పోలీస్‌స్టేషన్‌లో ఇంకా పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
చదవండి: ఫేస్‌బుక్‌ పరిచయం.. వివాహితతో ఎస్సై ప్రేమాయణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement