ఇన్ఫోసిస్ ఛైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ దాతృత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే సుధామూర్తి చాలా సింపుల్‌గా ఉంటారు. చెప్పాలంటే సింపుల్ సిటీకి కేరాఫ్ ఆమె అన్నంతగా చాలా సాదాసీదాగా ఉంటారామె. అయితే ఆమె వద్ద ఎన్నో చీరలు ఉండవని, షాపింగ్ చేయరని కథలు కథలుగా విన్నాం. రెండు లేదా మూడో చీరలే ఉంటాయని సుధా కూడా పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేంటి ఇన్ఫోసిస్ కంపెనీ అధినేత భార్య వద్ద అన్నే చీరలా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా.
నేటి రోజుల్లో చిన్నగా స్టార్‌డమ్ వచ్చి, పేరు ప్రఖ్యాతలు వస్తేనే..వారి రేంజ్, లుక్కు మారిపోతుంది. ఏదో గోల్డ్‌స్పూన్ బేబీ మాదిరి ఫోజులు ఇచ్చేస్తుంటారు. అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ అన్నట్లు ఉంటుది వ్యవహారం. కానీ ఆమె ఆహార్యం సాధారణ గృహిణిలా ఉంటుంది. ఇటీవలే అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఆమె రాజ్యసభ ఎంపీగా నామనేట్ అయ్యిన సంగతి తెలిసిందే. లోక్‌సభలో రాజ్యసభ ఎంపీగా తొలి ప్రసంగంలో చాలా ముఖ్యమైన అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ సైతం ఆమె ప్రసంగానికి ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన వద్ద చీరలు ఎందుకు లేవు? తాను ఎందుకు కొనుగోలు చెయ్యరో తదితర ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
తాను 30 ఏళ్లుగా చీర కొనలేదని అన్నారు. కాశీ పర్యటనకు వెళ్లినప్పుడూ మనకు బాగా ఇష్టమైనది వదిలేయాలి అని అంటారు. అందుకోసం తాను బాగా ఇష్టపడే షాపింగ్ ని వదిలేస్తానని గంగామాతకు వాగ్దానం చేశానని అన్నారు. తనకు పొదుపుగా, సింపుల్‌గా ఉండటం తన తల్లిదండ్రులు, తాతల నుంచి వచ్చిందని చెప్పారు. తన తల్లి చనిపోయినప్పుడూ ఆమె వస్తువులు పంచేందుకు కేవలం అరంగంట సమయమే పట్టిందన్నారు. ఎందుకంటే అప్పటికీ ఆమె వద్ద కేవలం నాలుగు చీరలు ఉన్నాయి. ఇలా సింపుల్‌గా బతకడం వాళ్ల పెంపకం నుంచి మొదలయ్యింది కాబట్టి చాలా సులభంగా సాదాసీదాగా జీవిస్తున్నానని అన్నారు.
రెండు దశాబ్దాలుగా తన సోదరీమణులు, సన్నిహితులు, తాను పనిచేసే ఎన్జీవోలు తనకు బహుమతిగా చీరలు ఇస్తుంటారని, వాటినే తాను ధరిస్తానని చెప్పారు. అలాగే ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ద్వారా జీవితాలు మారిపోయిన మహిళల బృందం చేతితో ఎంబ్రాయిడరీ చేసిన చీరలు ఇచ్చారని అవే తన వద్ద ఉన్నాయని సుధామూర్తి అన్నారు. అంతేగాదు తన సోదరీమణులు ప్రతి ఏడాది బహుమతిగా ఇస్తున్న చీరల సేకరణ పెరుగుతున్నందున నిర్వహించడం కష్టంగా ఉందని వారికే నేరుగా చెప్పేశానని అన్నారు.
అంతేగాదు సుధామార్తి చీరలు ధరించిన పర్యావరణ హితార్థం కనీసం ఐరన్ కూడా చేయించరు. అలాగే నేలను తుడిచేలా చీరను ధరించను కాబట్టి చాలా జాగ్రత్తగా, మన్నికగా బట్టలను వాడతాను కాబట్టి పెద్దమొత్తంలో చీరలు కావాల్సిన అవసరం పడలేదన్నారు. అపార సంపద ఉన్నప్పటికీ..అత్యంత సాదాసీదాగా జీవిస్తారు సుధా. ఆమె నుంచి సాధారణ జీవితంలోని గొప్పతనం, పొదుపుగా ఉండటం రెండూ నేర్చుకోవచ్చు. మనిషి వద్ద ఉండే అపారమైన మేధస్సు, జ్ఞానానికి మించిన గొప్ప వస్తువులు ఏమీ అవసరం లేదని సుమధామూర్తి ఆచరించి చూపిస్తున్నారు. అపారమైన సంపద ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలా ఉండే ఆమె ఆహార్యం ఎందరికో స్ఫూర్తి. ఇక ఆమె అనేక పుస్తకాలు రచించారు, ముఖ్యంగా పిల్లలపై ఎక్కువగా రాశారు.
(చదవండి: ఆ యోగాసనంలో కాబోయే తల్లి దీపికా పదుకొణె..ఆ టైంలో మంచిదేనా..!)
Comments
Please login to add a commentAdd a comment