‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘కాశి’. తెలుగమ్మాయి అంజలి, సునయన కథానాయికలు. క్రితిక ఉదయనిధి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు హక్కులను పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత విలియమ్ అలెగ్జాండర్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ‘కాశి’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. విలియమ్‌అలెగ్జాండర్ మాట్లాడుతూ –‘‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత విజయ్ ఆంటోని మదర్ సెంటిమెంట్‌లో మరో కోణం చూపించనున్న చిత్రమిది.
ఆయన తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ, చక్కటి సంగీతం అందించారు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్‌కి తెలుగులో చాలా మంచి క్రేజ్ రావడంతో ట్రేడ్‌లో బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆయన వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం వల్లే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘బిచ్చగాడు’ కంటే ‘కాశి’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment