విజయ్ ఆంటోని, సునైన
నటుడిగా, సంగీత దర్శకుడిగా తమిళంలో, తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నారు విజయ్ ఆంటోని. సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘కాశి’. అంజలి, సునైన కథానాయికలు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 18న విడుదలవుతోంది. లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కాశీ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా, ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాం. తమిళంలో ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్.
Comments
Please login to add a commentAdd a comment