తమిళ సినిమా : ఐ చిత్రంలో తమ మనోభావాలకు భంగం కలిగేవిధంగా చిత్రీకరించినట్టు హిజ్రాలు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా సోమవారం నుంగం బాక్కం శాస్త్రి భవన్ వద్ద ఉన్న సెన్సార్ కార్యాలయంలో పలువురు హిజ్రా లు ధర్నాకు దిగారు. వారిలో ప్రముఖ నటి రోశ్, బామా, డాక్టర్ సెల్వి తదితరులు ఉన్నారు. వీరంతా ఐ చిత్రంలో హిజ్రాలను కించ పరిచే సన్నివేశాలకు అనుమతించినందుకు గాను, సెన్సార్ బృందానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా హిజ్రా బామా మాట్లాడుతూ, ఐ చిత్రంలో హిజ్రాల మనో భావాలను దెబ్బ తిసే సన్నివేశాలను వెంటనే తొలగించి, ఆ చిత్ర దర్శకుడు శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లే కుంటే, ఐ చిత్రంపై తాత్కాళిక స్టే విధించాలన్నారు.
కమిషనర్‌కు వినతి పత్రం
కొందరు హిజ్రాలు నగరంలోని పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. హిజ్రాల సంఘం ఉప శాఖ అధ్యక్షురాలు సుధాతో పాటుగా ఇరవై మందికి పైగా హిజ్రాలు అక్కడ గుమిగూడారు. కాంచన చిత్రంలో నటించిన ప్రియ మాట్లాడుతూ, ఐ చిత్రంలో హిజ్రాలను అవమాన పరిచే సన్నివేశాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో విక్రమ్‌ను హిజ్రా ప్రేమించినట్టుగా, అందుకు ఆయన అవహేళన చేసినట్టుగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని కోరినా స్పందించలేదన్నారు. అందుకే ఈనెల 22న వళ్లువర్ కోట్టం వద్ద హిజ్రా సంఘాల నేతృత్వంలో భారీ నిరసన చేపట్టనున్నామని తెలిపారు. ఇందుకు కమిషనర్ అనుమతి కోరుతూ వినతి పత్రం అందజేశామన్నారు.
హిజ్రాల ఆందోళన
Published Tue, Jan 20 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM
Advertisement
Advertisement