నవంబర్‌లో అద్భుతాల ‘ఐ’ | 'Terminator 5' Movie: New Trailer to Release in November | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో అద్భుతాల ‘ఐ’

Published Mon, Oct 13 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:44 PM

నవంబర్‌లో అద్భుతాల ‘ఐ’

నవంబర్‌లో అద్భుతాల ‘ఐ’

ఐ చిత్రం విడుదల నవంబర్ నెలకు వాయిదా పడింది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వల్లే చిత్రం విడుదల వాయిదా పడిందని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు. స్టార్ దర్శకుడు శంకర్ తాజా అద్భుత సెల్యులాయిడ్ చిత్రం ఐ. ఇందులో సియాన్ విక్రమ్ నటుడిగా విశ్వరూపం చూపారు. అందాల భామ ఎమిజాక్సన్ హీరోయిన్. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్ ఫిలిం సంస్థ నుంచి వస్తున్న మరో వండర్‌ఫుల్ చిత్రం ఐ. పలు విశేషాలకు నెలవైన ఈ చిత్రం కోసం దర్శకుడు శంకర్‌తో పాటు నటుడు విక్రమ్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన తొలిసారిగా హిందీలోనూ తన పాత్రకు డబ్బిం గ్ చెప్పుకోవడం విశేషం.
 
 పస్తుతం ఐ చిత్రం హిందీ డబ్బింగ్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ డబ్బింగ్ థియేటర్‌లో ఇటీవలే పూర్తి చేశారని నిర్మాత తెలిపారు. తదుపరి తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పనున్నారని తెలిపారు. తమిళ వెర్షన్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను అతిథిగా రప్పించిన ఆస్కార్వ్రిచంద్రన్ త్వరలో తెలుగు వెర్షన్ ఆడియో ఆవిష్కరణకు జాకీచాన్‌ను ఆహ్వానిస్తున్నారు. కాగా ఐ చిత్రం ప్రీమియర్ షోను సింగపూర్, యూఎస్‌లో ఏర్పాటు చేయనున్నామని, దీనికి రావడానికి సిల్వర్‌స్టార్ స్టాలోన్ అంగీకరించారని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 20 వేల థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement