'ఐ' సినిమా హీరోయిన్‌.. ఇలా అయిపోయిందేంటి? | Amy Jackson Unrecognisable Latest Look Pic Trending On Social Media, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

Amy Jackson Latest Look: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్‌.. 'విక్రమ్‌ ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకున్నాడు!'

Published Fri, Sep 22 2023 11:10 AM | Last Updated on Fri, Sep 22 2023 11:55 AM

Amy Jackson Latest Look is Unrecognisable - Sakshi

తనేదైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకుందా?.. గతంలోనే తన లుక్‌ బాగుందని, ఇప్పుడస్సలు బాగోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమీ జాక్సన్‌.. విక్రమ్‌ 'ఐ', రామ్‌ చరణ్‌ 'ఎవడు', 'రోబో 2.0' సినిమాలతో తెలుగు వారికి ఎంతో దగ్గరైంది. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్‌మేన్‌ జార్జ్‌ను ప్రేమించిన ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి ఎడ్‌ వెస్ట్‌విక్‌ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ బ్యూటీ మిషన్‌ చాప్టర్‌ 1: అచ్చమ్‌ ఎంబతు ఇల్లయే అనే తమిళ సినిమా చేస్తోంది.

ఇకపోతే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అమీ జాక్సన్‌ ఈ మధ్య గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్‌.. తను అమీ జాక్సన్‌లానే లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన హాలీవుడ్‌ మూవీ ఓపెన్‌హైమర్‌లోని నటుడు సిలియన్‌ మర్ఫీలా ఉందంటున్నారు. అమీ.. ఏదైనా వ్యాధితో బాధపడుతుందా? లేదంటే ఏదైనా సర్జరీ చేయించుకుందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరేమో ఐ సినిమాలో విక్రమ్‌ తనను మోసం చేసిన అందరి మీదా ప్రతీకారం తీర్చుకున్నాడు, ఇన్నాళ్లకు హీరోయిన్‌పై రివేంజ్‌ తీర్చుకున్నాడంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అమీ జాక్సన్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. గతంలోనే తన లుక్‌ బాగుందని, ఇప్పుడస్సలు బాగోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



చదవండి: డీజే టిల్లు హీరోయిన్‌తో డైరెక్టర్‌ గొడవ.. మూడు నెలలు మాట్లాడుకోలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement