పండగకి ‘ఐ’ రిలీజ్ సరికాదు
‘‘కొంతమంది అగ్రనిర్మాతలు థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న నిర్మాతలను ఇబ్బందులపాలు చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ సమయాలలో అనువాద చిత్రాలను విడుదల చేయకూడదని రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి తీర్మానించిన నేపథ్యంలో ‘ఐ’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంవల్ల, థియేటర్లు దొరక్క కొన్ని చిత్రాల విడుదల ఆగిందని ఆయన ఆరోపించారు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రాన్ని కూడా పండగకి విడుదల చేయాలనుకున్నారనీ, కానీ థియేటర్లు దొరక్క వాయిదా వేసుకున్నారనీ ఆయన అన్నారు.