Producer natti kumar
-
నిఖిల్ క్షమాపణలు చెప్పాలి
‘‘ముద్ర’ సినిమా నాది కాదు. నా ఫోటో పెట్టుకొని టికెట్స్ అమ్ముకుంటున్నారు’ అని నిఖిల్ అంటున్నాడు. ఈ విషయం గురించి నిర్మాతను కానీ నన్ను కానీ అడిగావా? ఏమీ కనుక్కోకుండా సినిమా చూడొద్దంటావా? ఎవడో కన్నయ్య చెబితే నువ్వు పోస్ట్ పెడతావా? అన్నం పెట్టేది నిర్మాత. ఈ సినిమా చూడొద్దు అని కామెంట్ చేస్తే నష్టపోయేది ఎవరు? నిర్మాతే కదా. నీకేం పోయింది. నిర్మాతలను అవమానించినందుకు సోమవారంలోగా నువ్వు క్షమాపణలు చెప్పాలి’’ అని హీరో నిఖిల్‌పై నిర్మాత నట్టికుమార్ మండిపడ్డారు. జగపతిబాబు హీరోగా నట్టికుమార్ నిర్మించిన చిత్రం ‘ముద్ర’ ఈ 25న రిలీజైంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నిఖిల్ ముద్ర’. 24వ తారీఖు మధ్యాహ్నం ‘ముద్ర’ సినిమా నాది కాదు. కొందరు కావాలని నా సినిమానే విడుదలైనట్లు ప్రచారం చేస్తున్నారంటూ నిఖిల్ తన ట్వీటర్లో పోస్ట్ చేశారు. దీనిని ఖండిస్తూ నిర్మాత నట్టికుమార్ శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ – ‘‘నిఖిల్ పోస్ట్ గురించి నాకు తెలిసిన వెంటనే ఆయనకు నోటీసులు పంపాను. సైబర్ క్రైమ్‌కు కంప్లైయింట్ కూడా చేశాం. ‘నిఖిల్ ముద్ర’ సినిమాను కొన్న వ్యక్తే నా సినిమాను రిలీజ్ చేశారు. మా సినిమా పోస్టర్స్ స్థానంలో నిఖిల్ సినిమా పోస్టర్స్ ఉన్నాయని, ఇలా పోస్టర్స్ మార్చి ఆన్లైన్లో టికెట్స్ అమ్ముతున్నారని ఆయనకు చెబితే ‘అలా జరగదు. జరిగినా ఊరుకోరు’ అని చెప్పారు. దాంతో మేం ఆన్లైన్లో చెక్ చేస్తే ఈయన (నిఖిల్) పేరు, పోస్టర్స్ లాంటివి ఏం లేవు. మా సినిమా లిస్టే వస్తోంది. దాంతో మేం వదిలేశాం. కానీ సాయంత్రం ఓ టీవీలో నిఖిల్ తన సినిమా పోస్టర్ ఉందన్నట్లుగా మాట్లాడాడు. నా టైటిల్ లాక్కున్నారు అన్నాడు. నా సినిమా సెన్సార్ అయింది. నీ టైటిల్ ఎక్కడ లాక్కున్నాను? నువ్వు నిజంగా హీరోవైతే సాక్ష్యాలతో రా. ఏ చానల్‌కి వస్తావో చూసుకుందాం. నువ్వు కరెక్ట్ అయితే నీకు సెల్యూట్ చేస్తా. లేకపోతే ఇండస్ట్రీ నుంచి హీరోగా విరమించుకుంటావా? ఈ పరిస్థితిలో నేను కాకుండా మరో నిర్మాత ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాడు. నిర్మాత మీద గౌరవం లేదు. సినిమా చూడొద్దు అనడానికి నువ్వెవరివి? నష్టపరిహారం కట్టేదాక నీ సినిమా రిలీజ్ కాదు. సోమవారం 7 గంటలకు మీటింగ్‌కు పిలుస్తున్నాను. ‘మా’ కూడా కలగజేసుకోవాలి. నిఖిల్ హీరోగా అనర్హుడు. ఇలా మాట్లాడితే ఎవరైనా అనర్హుడే. సోమవారంలోపు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా విషయాలు బయటపెడతాను’’ అన్నారు. -
బడా నిర్మాతల వల్లే ...
‘‘థియేటర్ల బంద్ వల్ల ఎగ్జిబిటర్లు, చిన్న నిర్మాతలు సుమారు వంద కోట్ల రూపాయలు నష్టపోయారు. థియేటర్ల మూత వల్ల క్యాంటిన్, పార్కింగ్‌ల దగ్గర పనిచేసే కార్మికులు ఇబ్బందులుపడ్డారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లైన క్యూబ్, యు.ఎఫ్.ఓ, పీఎక్స్‌డీ కంపెనీల వాళ్లు ఆయా థియేటర్లకు తమ మిషన్లను బిగించి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. వాళ్ల పెట్టుబడి పోను ఆ సంస్థలు ఎప్పుడో లాభాల బాట పట్టాయి. అయినా అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. కొందరు బడా నిర్మాతలు ఆ సంస్థలకు కొమ్ముకాయటం వల్లే ఈ పరిస్థితి’’ అన్నారు నిర్మాత నట్టికుమార్. బుధవారం మధ్యాహ్నం విలేకరులతో ఆయన మాట్లాడుతూ – ‘‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత పరిహారం అందజేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ చిత్రం వల్ల నష్టపోయిన ఓ ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఎగ్జిబిటర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రజలకు న్యాయం చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొనే పవన్‌కళ్యాణ్, చిత్రనిర్మాత ఈ సినిమా ద్వారా నష్టపోయినవారిని ఆదుకోవాలి’’ అన్నారు. ‘‘వచ్చే ఎన్నికలలో యం.యల్.ఏ అభ్యర్థిగా వైజాగ్ నుండి పోటీ చేయబోతున్నా’’ అని ఆయన అన్నారు. -
మా ఫ్యామిలీపై నోరు పారేసుకోవడం సరికాదు
-
నట్టి కుమార్ Vs మంత్రి అచ్చెన్నాయుడు
-
మంత్రి అచ్చెన్నకు సంబంధాలున్నాయా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/నరసన్నపేట: ఇటీవల ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ నయీంకు అధికార టీడీపీ నాయకులకు సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సినీనిర్మాత నట్టికుమార్ ప్రకటన మరింత సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు సెటిల్మెంట్లలో, కిరాయి హత్యలతో, బ్లాక్‌మెయిలింగ్ కేసుల్లో నయీం ముఠా హస్తమేమిటనేదీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యవహారాలే జిల్లాలోనూ చోటుచేసుకున్నాయనేసరికి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నయీం ముఠా అకృత్యాలపై ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు పట్టించుకోలేదన్న నట్టి కుమార్... తనకు అన్యాయం జరగడానికి నయీంకు, మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధం ఉండటమే కారణమని మీడియా ముందు ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిర్మాత నట్టి కుమార్ రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమాహాళ్లను గతంలో లీజుకు తీసుకున్నారు. వాటిలో రెండు జిల్లాలోని నరసన్నపేట, నరసన్నపేట, కవిటిలో కూడా ఉన్నాయి. సోమవారం నట్టికుమార్ మంత్రి అచ్చెన్నాయుడిపై చేసిన ఆరోపణల్లో నరసన్నపేట థియేటర్ ప్రస్తావన వచ్చింది. అలా ప్రకటించి కొద్ది గంటల వ్యవధిలోనే ఇంటెలిజెన్స్ పోలీసులు నరసన్నపేటలోని వెంకటేశ్వర యాజమాన్యంతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వెంకటేశ్వర థియేటర్‌ను 12 ఏళ్ల పాటు లీజుకు నట్టికుమార్ తీసుకున్నారు. అయితే కొంతకాలం ఈ వ్యవహారం సజావుగా సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏడాది క్రితం ఈ లీజు సొమ్ము చెల్లింపు విషయంలో నట్టికుమార్‌కు థియేటర్ యాజమాన్యానికి వివాదాలు తలెత్తాయి. దీంతో వారి మధ్య సెటిల్మెంట్ వ్యవహారంలో నయీం జోక్యం చేసుకున్నాడని నట్టికుమార్ సోమవారం ఆరోపించారు. ఈ సెటిల్మెంట్ వ్యవహారం తనకు నష్టం చేకూర్చేలా ఉందని, నయీం గ్యాంగ్ జోక్యం అన్యాయంగా ఉందని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నట్టికుమార్ ఆరోపించారు. అంతేకాదు జిల్లాలోని పోలీసు అధికారుల్లో ఎక్కువ మంది మంత్రి అచ్చెన్నాయుడికి బంధువులేనని, అందువల్లే తనకు న్యాయం జరగలేదని ఆరోపించడం సంచలనమైంది. నయీం జిల్లాకు వచ్చాడా...? నయీం జిల్లాకు వచ్చాడా అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... రెండు నెలల క్రితం నయీం తన ముఠాతో కలిసి శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో మకాం వేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. దీనిపై హడావుడి నడిచింది. కానీ పోలీసులు తాము ఎందుకు హోటల్‌కు వెళ్లారో, ఎందుకు తనిఖీలు నిర్వహించారో బయటకు పొక్కనీయలేదు. సహజంగా నిర్వహించే తనిఖీలే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఒకవేళ నిజంగా వచ్చింది నయీమే అయితే పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పోలీసుశాఖలో తమకున్న పలుకుబడితో టీడీపీ నాయకులెవ్వరైనా అడ్డుకున్నారా? అనే సంశయం నెలకొంది. ఈ నేపథ్యం లో నట్టికుమార్ నేరుగా జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కోర్టు ద్వారానే తేల్చుకున్నాం నట్టి కుమార్ ఆరోపణలపై నరసన్నపేటలోని థియేటర్ యజమాని కృష్ణప్రసాద్ స్పందిస్తూ ....నట్టికుమార్ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లీజ్‌కు సంబందించి వివాదం కోర్టు ద్వారా చట్ట ప్రకారం సెటిల్మెంట్ చేసుకున్నామని చెప్పారు. ఫిలించాంబర్ ప్రతినిధులు కూడా తమ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించారని వెల్లడించారు. -
కథ నచ్చితే కొత్త దర్శకులతో సినిమా చేస్తా
- నట్టికుమార్ ‘‘నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లయింది. అతి తక్కువ సమయంలోనే 63 సినిమాలు చేశాను. ‘యుద్ధం’ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయకూడదనుకున్నాను. కానీ మళ్లీ సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యాను’’ అని నిర్మాత నట్టికుమార్ చెప్పారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘నేను ఇండస్ట్రీలో చివరి వరకూ గౌరవించే వ్యక్తి దాసరినారాయణరావుగారు. ఆయన దగ్గరే మెలకువలు నేర్చుకున్నా. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, రామానాయుడుగారు నాకు ఇష్టమైన వ్యక్తులు. రామానాయుడు నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఉండేవారు. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. మార్కెట్ విలువలు తగ్గడంతో సినిమాలు తీయడం మానుకున్నాను. కానీ ఈ సారి నుంచి నా పిల్లల పేర్ల మీద సినిమాలు తీస్తాను. మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా సినిమా తీయడానికి రెడీ. వచ్చే ఏడాది నా కుమారుడు క్రాంతిని ఓ పెద్ద బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తాను’’ అని చెప్పారు. -
పండగకి ‘ఐ’ రిలీజ్ సరికాదు
‘‘కొంతమంది అగ్రనిర్మాతలు థియేటర్లను తమ చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న నిర్మాతలను ఇబ్బందులపాలు చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ సమయాలలో అనువాద చిత్రాలను విడుదల చేయకూడదని రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి తీర్మానించిన నేపథ్యంలో ‘ఐ’ చిత్రాన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంవల్ల, థియేటర్లు దొరక్క కొన్ని చిత్రాల విడుదల ఆగిందని ఆయన ఆరోపించారు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ చిత్రాన్ని కూడా పండగకి విడుదల చేయాలనుకున్నారనీ, కానీ థియేటర్లు దొరక్క వాయిదా వేసుకున్నారనీ ఆయన అన్నారు.