
నిర్మాత నట్టికుమార్
‘‘థియేటర్ల బంద్ వల్ల ఎగ్జిబిటర్లు, చిన్న నిర్మాతలు సుమారు వంద కోట్ల రూపాయలు నష్టపోయారు. థియేటర్ల మూత వల్ల క్యాంటిన్, పార్కింగ్‌ల దగ్గర పనిచేసే కార్మికులు ఇబ్బందులుపడ్డారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లైన క్యూబ్, యు.ఎఫ్.ఓ, పీఎక్స్‌డీ కంపెనీల వాళ్లు ఆయా థియేటర్లకు తమ మిషన్‌లను బిగించి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. వాళ్ల పెట్టుబడి పోను ఆ సంస్థలు ఎప్పుడో లాభాల బాట పట్టాయి. అయినా అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. కొందరు బడా నిర్మాతలు ఆ సంస్థలకు కొమ్ముకాయటం వల్లే ఈ పరిస్థితి’’ అన్నారు నిర్మాత నట్టికుమార్.
బుధవారం మధ్యాహ్నం విలేకరులతో ఆయన మాట్లాడుతూ – ‘‘అజ్ఞాతవాసి’ వల్ల నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత పరిహారం అందజేస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఈ చిత్రం వల్ల నష్టపోయిన ఓ ఎగ్జిబిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ఎగ్జిబిటర్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ప్రజలకు న్యాయం చేయటం కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొనే పవన్‌కళ్యాణ్, చిత్రనిర్మాత ఈ సినిమా ద్వారా నష్టపోయినవారిని ఆదుకోవాలి’’ అన్నారు. ‘‘వచ్చే ఎన్నికలలో యం.యల్.ఏ అభ్యర్థిగా వైజాగ్ నుండి పోటీ చేయబోతున్నా’’ అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment