కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో ‘చియాన్’ విక్రమ్. కానీ, అపరిచితుడు తర్వాత ఆయనకు సరైన హిట్ లేకుండా పోయింది. దశాబ్దానికి పైగా వరుసగా చిత్రాలు బోల్తా పడుతున్నాయి. గత చిత్రం స్కెచ్ అయితే డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 15 ఏళ్ల క్రితం తనకు సామితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరితో విక్రమ్ మరోసారి జోడీ కట్టాడు. సామి స్క్వేర్‌గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను తాజాగా వదిలారు.