
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే అభిమానులే కాదు, పేక్షకులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'అతడు', 'ఖలేజ' వంటి చిత్రాల తరువాత హ్యాట్రిక్ చిత్రం కోసం వీరిద్దరూ రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం త్రివిక్రమ్ ప్రముక తమిళ హీరో విక్రమ్‌ను సంప్రదించినట్టుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విక్రమ్‌కు సంబంధించిన మేనేజర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. దాంతో పాటు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన తెలిపాడు. ఇక దీంతో మహేశ్ బాబు సినిమాలో విక్రమ్ లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది. అయితే ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment