![Director Hari and Harish Kalyan take salary cuts to help producers - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/9/HAR.jpg.webp?itok=2vlZ5wFl)
తమిళ దర్శకుడు హరి
‘‘నిర్మాతలు బావుంటేనే సినిమా ఇండస్ట్రీ బావుంటుంది. కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయి సినిమాలు ప్రారంభమయ్యాక నిర్మాతలకు సహకరిద్దాం’’ అని కోరుతున్నారు తమిళ దర్శకుడు హరి. సూర్యతో ఆరు, ‘సింగం’ సిరీస్, విక్రమ్‌తో సామి, సామి స్క్వేర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు హరి. ప్రస్తుతం మరోసారి సూర్యతో ఓ సినిమా చేయనున్నారు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అరువా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాశీ ఖన్నా హీరోయిన్.
నిర్మాతలకు సహాయపడటం కోసం ఈ సినిమాకు హరి పారితోషికానీ 25 శాతం తగ్గించుకోనున్నారట. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారాయన. ఇలా చేస్తే నిర్మాతలకు సహాయపడినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే తమిళ హీరో హరీష్ కల్యాణ్ (‘జెర్సీ’లో నాని కుమారుడిగా నటించారు) కూడా తన పారితోషికాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూడా తన రెమ్యూనరేషన్‌లో 25 శాతం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment