Express Hari And Ashu: అషూపై తన ప్రేమను 'ఎక్స్‌ప్రెస్‌' చేసిన హరి.. - Sakshi
Sakshi News home page

Ashu Reddy : అషూపై తన ప్రేమను 'ఎక్స్‌ప్రెస్‌' చేసిన హరి..

Published Sat, Jul 10 2021 8:28 PM | Last Updated on Sun, Jul 11 2021 9:46 AM

Ashu Reddy Name Tattoo In Express Hari Heart Video Viral - Sakshi

జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఇక డబ్‌ స్మాష్‌తో ఫేమస్‌ అయిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషూ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో తనతో​ పాటు పాల్గొన్న రాహుల్‌ సిప్లిగంజ్‌తో అషూ లవ్‌ ట్రాక్‌ నడిపింస్తుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి తోడు ఈ మధ్యే రాహుల్‌.. సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసి దానికి లవ్‌ సింబల్‌ యాడ్ చేసి రూమర్స్‌కి మరింత బలం చేకూర్చాడు. అయితే తాజాగా కమెడియన్‌ ఎక్స్‌ప్రెస్ హరి-అషూ మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అషూ కోసం హరి కూడా బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అషూపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన గుండెలపై అషూ పేరును పచ్చబొట్టు వేసుకున్నానని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు.

'నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత' అంటూ హరి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్‌ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు. దీంతో ఎందుకిలా చేశావ్‌ అంటూ అషూ..హరి చెంప పగలకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. రాహుల్‌-అషూ మధ్యలోకి హరి ఎంటర్‌ అయ్యాడు అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. టీఆర్పీ రేటింగుల కోసమే ఈ డ్రామాలంటూ మరొకొందరు కామెంట్‌ చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement