పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే? | Padmavyuhamlo Chakradhari Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Padmavyhamlo Chakradhari Movie Review: పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published Fri, Jun 21 2024 8:54 PM | Last Updated on Sat, Jun 22 2024 10:58 AM

Padmavyuhamlo Chakradhari Movie Review In Telugu

టైటిల్: పద్మవ్యూహంలో చక్రధారి
నటీనటులు: ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌, శశికా టిక్కూ, అషురెడ్డి, మధునందన్, భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి , మాస్టర్ రోహన్, మురళీధర్ గౌడ్, మహేష్ విట్టా తదితరులు.
దర్శకత్వం: సంజయ్‌రెడ్డి బంగారపు
నిర్మాత:  కే.ఓ.రామరాజు
నిర్మాణ సంస్థ: వీసీ క్రియేషన్స్
సంగీత దర్శకుడు: వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ: జీ. అమర్
ఎడిటర్: ఎస్ బీ ఉద్దవ్
విడుదల:21 జూన్‌ 2024

వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై కే. ఓ రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం పద్మవ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ హీరోగా పరిచయం అయిన ఈ సినిమా నేడు థియేటర్లో విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఫస్ట్‌ సిటీలో మొదలైన ప్రేమ కథను విలేజ్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్‌లోనే అన్ని క్యారెక్టర్లను రివీల్ చేసి సినిమాపై ఇంట్రస్ట్‌ తగ్గించేశాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ వర్కవుట్ అయింది. విలేజ్‌లో ఉండే క్యారెక్టర్లను కాస్తా ఫన్నీగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌ రోటీన్‌గానే అనిపిస్తాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. హీరోయిన్ కోసం గ్రామానికి హీరో రావడం...ఫ్రెండ్‌ శ్రీను హెల్ప్ తీసుకోవడం...అంతా పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. 

అయితే సెకండ్ హాఫ్‌లో కామెడీ ఎక్కడా ఫరవాలేదు. ఇక హీరో, హీరోయిన్ ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి తెలియడం..  అల్లుడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆయన చెప్పడం గతంలో చూసిన సినిమా లాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ దగ్గరకు వెళ్లడం, నిజం తెలుసుకొని ప్రసాద్ మారడం రోటీన్‌గానే అనిపిస్తుంది. ఇక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల భావోద్వేగాలతో కట్టిపడేశారు. ఓవరాల్‌గా రోటీన్‌ లవ్ స్టోరీనే తెరపై చూపించే ప్రయత్నం చేశారు. విలేజ్ నేపథ్యంలో సాగే కథను పల్లె వాతవరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.


ఎవరెలా చేశారంటే..

హీరోగా ప్రవీణ్‌ రాజ్‌కుమార్‌ తొలిపరిచయం అయినా నటనతో మెప్పించారు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది. అషురెడ్డి తను గ్లామర్‌తో కట్టిపడేసింది. మురళిధర్ గౌడ్, మహేష్ విట్టా, మధునందన్,  భూపాల్ రాజ్, ధనరాజ్, రూపా లక్ష్మి, తమ పాత్రల మేర మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే.. రచయిత దర్శన్ రాసుకున్న డైలాగ్స్ విలేజ్ నెటివిటీకి సరిపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్‌లో ఇంకాస్తా కట్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement