
కవ్వింత: కోతి పిల్లాడు
కోతిని భుజాన ఎక్కించుకుని రోడ్డు మీద నడుస్తున్నాడు హరి. ట్రాఫిక్ పోలీస్ చూసి, ‘‘ఏయ్, నీ పేరేమిటి? ఆ కోతిని జూకు తీసుకెళ్లు’’ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ‘‘సరే సార్’’ వినయంగా జవాబిచ్చాడు హరి. తెల్లారి, మళ్లీ అదే రోడ్డుమీద, అదే కోతిని భుజాన ఎక్కించుకుని వెళ్తున్నాడు హరి. మళ్లీ పోలీసు చూశాడు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్, నీకు నిన్న దీన్ని జూకు తీసుకెళ్లమని చెప్పానా లేదా?’’ కోపంగా అన్నాడు. ‘‘మీరు చెప్పినట్టే నిన్న జూకే తీసుకెళ్లాన్ సార్. ఇవ్వాళ సినిమాకు తీసుకెళ్తున్నా’’ వినయంగా బదులిచ్చాడు హరి.
అంకెలు కనబడుటలేదు!
పిల్లలతో కాలిక్యులేటర్ ప్రాక్టీస్ చేయిస్తూ, ఉదాహరణ కోసం 10+5 కూడమంది టీచర్. ఒక్క వెంగళప్ప తప్ప అందరూ చేశారు. ‘‘ఏం, నువ్వెందుకు చేయలేదు?’’ ప్రశ్నించింది టీచర్.
‘‘నాకు 10 ఎక్కడుందో కనబడట్లేదు మేడమ్’’ జవాబిచ్చాడు వెంగళప్ప.
కిందివీ మెట్లే!
‘‘యాభై అడుగుల నిచ్చెన మీదినుంచి కింద పడ్డాను తెలుసా?’’ చెప్పింది బుజ్జి.
‘‘అయ్యో, దెబ్బలేమీ తగల్లేదుకదా!’’ అడిగాడు చంటి.
‘‘లేదు, మొదటి మెట్టునుంచి పడ్డాను’’ అంది బుజ్జి.