![Jabardasth Comedian Hari Red Wood Smuggling Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/12/5.jpg.webp?itok=gJakZZyu)
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు.
(ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు)
కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే
Comments
Please login to add a commentAdd a comment