
దెయ్యం ఉందా?
ఆ నలుగురు యువకులు దెయ్యం ఉందా? లేదా? అని వాదించుకుంటారు. నలుగురిలో ఒకడు దెయ్యం లేదంటాడు. ఒకవేళ ఉందని నిరూపిస్తే తన ఆస్తిలో సగం రాసిస్తానని మిగతా ముగ్గురికీ సవాల్ విసురుతాడు. ఇంతకూ దెయ్యం ఉందా..? లేదా అనే కథాంశంతో సాగే చిత్రం ‘అమ్మో’. ఇ.ఆర్.వి లోకనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీశ్ దర్శకులు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. నాగరాజన్.