
యాక్షన్ మూవీలో...
ఏ హీరో అయినా మంచి యాక్షన్ మూవీ చేస్తేనే మాస్ ఇమేజ్ వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో సాయిరామ్ శంకర్ ఓ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు.
ఇప్పటివరకు తను చేసిన చిత్రాల్లో ఫైట్స్ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాలనిపించుకోలేదు. ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ చేయబోతున్నారు సాయిరామ్‌శంకర్. హరి దర్శకత్వంలో శ్రీ చిన్న గోవిందా మూవీ మేకర్స్ పతాకంపై ఎన్. వెంకటకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభమైంది. పూజా క్యార్యక్రమాలు జరిపామని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.