దక్షిణాధి ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్
దక్షిణాధి ప్రేక్షకులకు న్యూ ఇయర్ గిఫ్ట్
Published Mon, Dec 30 2013 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
గబ్బర్‌సింగ్, బలుపు సినిమాల పుణ్యమా అని తెలుగులో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది శ్రుతిహాసన్. ఇతర భాషల్లో అయితే... ఇప్పటివరకూ శ్రుతికి హిట్టే లేదు. రెండేళ్ల క్రితం తమిళంలో ‘3’ సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ మాతృభాష వైపు కన్నెత్తి అయినా చూడలేదు. అయినా.. కమల్ తనయ కావడంతో తమిళనాట శ్రుతికి ఫాలోయింగ్ ఎక్కువే. అక్కడి అభిమానులు ‘సినిమా ఎప్పుడు?’ అని తరచూ అడుగుతూనే ఉన్నారామెను.
ఎట్టకేలకు వారందరికీ ట్విట్టర్ ద్వారా శుభవార్త చెప్పేసింది శ్రుతిహాసన్. ‘‘తమిళ సినిమా ఎప్పుడు చెస్తారని అందరూ అడుగుతున్నారు. మంచి కథ కోసమే ఇన్నాళ్లూ వెయిట్ చేశా. త్వరలోనే ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా తమిళంలో రూపొందినా... తెలుగు ప్రేక్షకులకూ ఇది కానుక లాంటిదే’’ అని ట్విట్ చేశారు శ్రుతి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కానుక ఎలా? అని ఆరాతీస్తే.. తెలిసిన విషయం ఏంటంటే, శ్రుతి చేయబోతున్న తమిళ సినిమాకు హీరో విశాల్ . దర్శకుడు హరి.
యముడు, సింగం-2 చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా హరి చేరువైన విషయం తెలిసిందే. వీరి సినిమా అంటే తెలుగులో విడుదల తథ్యం. అందుకే తెలుగువారిక్కూడా కానుక అన్నారు శ్రుతి. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. రామ్‌చరణ్‌కి జోడీగా ఆమె నటించిన ‘ఎవడు’ ఈ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే... బన్నీతో చేస్తున్న ‘రేసుగుర్రం’ నిర్మాణంలో ఉంది. బాలీవుడ్‌లో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘ఠాగూర్’ రీమేక్ ‘గబ్బర్’లో నాయికగా శ్రుతినే ఎంపికయ్యారట. జాన్‌అబ్రహం ‘వెల్‌కమ్ బ్యాక్’ ఎలాగూ ఉంది. ఇలా అన్ని భాషల్నీ కవర్‌చేస్తూ యమ బిజీగా ఉన్నారు శ్రుతిహాసన్.
Advertisement
Advertisement