సూర్య కత్తి | Suriya reunites with director Hari for Aruva | Sakshi
Sakshi News home page

సూర్య కత్తి

Published Mon, Mar 2 2020 5:20 AM | Last Updated on Mon, Mar 2 2020 5:20 AM

Suriya reunites with director Hari for Aruva - Sakshi

సూర్య

కొన్ని కాంబినేషన్స్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా మరిన్ని కావాలనిపిస్తాయి. తమిళంలో అలాంటి కాంబినేషనే హీరో సూర్య–దర్శకుడు హరిలది. ఈ ఇద్దరూ కలసి గతంలో 5 సినిమాలు (వేల్, ఆరు, సింగం 1, 2 , 3) చేశారు. తాజాగా ఆరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అరువా అంటే కత్తి అని అర్థం. ఏప్రిల్‌లో సెట్స్‌కు మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారట. ఈ ఏడాది దీపావళికి ఈ సినిమాను రిలీజ్‌ చే స్తున్నట్టు గ్రీన్‌ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ తెలిపింది. డి. ఇమ్మాన్‌ సంగీత దర్శకుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement