
‘‘నా దగ్గర ఓ వెబ్ సిరీస్‌కు సుబ్రమణ్యం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ‘నెల్లూరి నెరజాణ’ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే టీమ్ అందరూ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, వారందరికీ గొప్ప జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు.
ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షాఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ‘‘నెల్లూరి నెరజాణ’ సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది’’ అన్నారు చిగురుపాటి సుబ్రమణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సుబ్రమణ్యంగారికి కృతజ్ఞతలు’’ అన్నారు ఎంఎస్ చంద్ర, హరి, అక్షా ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment