అటా ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లో ఉచిత వైద్య సేవలు
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్‌లో అమెరికా తెలుగు సంఘం(అటా) డెంటల్, యోగా, మెడిటేషన్ సెషన్లను నిర్వహించింది. డెట్రాయిట్ అటా ట్రస్టీ హరి లింగాల, టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 130 హెల్త్ స్క్రీనింగ్‌లను చేశారు. వీటిలో ఈకేజీ 70 డెంటల్ స్క్రీనింగ్స్, 25 ఎక్స్‌రేలు ఉన్నాయి. మెడిటేషన్, యోగా కార్యక్రమాలకు కూడా కొందరు హాజరయ్యారు.
మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 20 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. అశోక్ కొండూరు, సన్నీ రెడ్డిలకు కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.