హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇటీవల అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనిపై సమాజం రకరకాలుగా స్పందిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ దీనిపై ట్విట్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: ‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత
ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తుంటే.. డాగ్ లవర్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాటికి సపరేట్‌గా వసతి కల్పించాలని, అవి మనలాగే ప్రాణులంటూ ఇటీవల జంతు ప్రేమికురాలు, యాంకర్ రష్మీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బ్లూక్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ ఘటనపై మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ జంతుప్రేమికురాలిగా అమల కుక్కలను శత్రువులుగా చూడోద్దని సూచించారట. ‘ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా? ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షించడ సరికాదు కదా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి’ అని అమల వ్యాఖ్యానించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తను సురేఖ వాణి కూతురు సుప్రిత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో అమల కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆమె నిజంగానే ఈ కామెంట్స్ చేసిందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అమల స్పందించేవరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment