వీధికుక్కల బెడదపై చిన్నారుల వినూత్న నిరసన
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్‌సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్‌సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్‌కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment