Anchor Rashmi Gautam reacts to stray dog attack in Hyderabad - Sakshi
Sakshi News home page

Anchor Rashmi: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్‌ రష్మీ

Feb 22 2023 10:01 AM | Updated on Feb 22 2023 11:13 AM

Anchor Rashmi Gautam Respond On Stray Dog Attack in Hyderabad - Sakshi

హైదరాబాద్‌ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆదివారం అంబర్‌ పేట్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో అయిదేళ్ల బాలుడు ప్రదీప్‌ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. అంతేకాదు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ఇది అత్యంత బాధాకరమన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కూడా ఈ వీధి కుక్కల దాడిపై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేస్తూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.

చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

‘అవును.. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో ఆ చిన్నారి చనిపోయాడు. ఇది అత్యంత బాధాకర విషయం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల బర్త్‌ కంట్రోల్‌కు వ్యాక్సినేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి. దానితో పాటు వాటికి సపరేటుగా వసతి కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. అయితే రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వాటి​కి సంబంధించిన ఫొటోలు, వీడియోలనుషేర్‌ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటుంది. ఇక లాక్‌డౌన్‌లో ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టి మంచి మనసు చాటుకుంది. 

చదవండి: సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్‌ సంయుక్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement